- పెరుగుతున్న ఛార్జీలు
- బకాయిలు రాబట్టుకోలేని యాజమాన్యం
- పెంపుదలను తప్పుపట్టిన మాజీ డైరెక్టర్లు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలోని ప్రముఖ వైద్య సంస్థ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు వెళ్తే గుండెగు'భిల్లు' అవనున్నది. ఈ దెబ్బతో సామాన్యులు నిమ్స్ గడపలోకే అడుగుపెట్టాడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన కార్యనిర్వాహక మండలి సమావేశం నిమ్స్‌లో మౌలిక సదుపాయాలు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే కీలక అంశాలపై కాకుండా 'ఆదాయం'పైనే దృష్టిపెట్టింది. రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం చేతకాక, రోగులపై భారాలు మోపడానికి సిద్ధమైంది. నిమ్స్‌లో గదుల అద్దెను పెంచాలని, ఆదాయం కోసం మెడికల్‌షాపులు నిర్వహించాలని, బయటి రోగులకు నిమ్స్‌లో డయాగస్టిక్ పరీక్షలు నిర్వహించాలని, దీనికి రుసుము వసూలు చేయాలని తీర్మానించింది. జనరల్ వార్డు రేటును రూ.200 నుంచి రూ.600లకు, పేయింగ్ రూం రేటును రూ.800 నుంచి రూ.1200లకు, ఐసియు రేటును రూ.1500 నుంచి రూ.3000లకు, రెండో దశ ఐసియుకు రూ.600 నుంచి రూ.1000లకు, ఔట్‌పేషెంట్ ఛార్జిని రూ.50 నుంచి రూ.150లకు పెంచనున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ధరలు పెంచారు. పెరిగిన ధరలతో నెలకు కోటి రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
ధరలు వెల్లడించని నిమ్స్
సాధారణంగా ప్రభుత్వం ఆర్టీసి, విద్యుత్, ఇతర ఛార్జీలు పెంచినప్పుడు వెల్లడిస్తుంది. నిమ్స్‌కూడా ప్రభుత్వ సంస్థే. ప్రజలకు సంబంధించిన సంస్థ ఇది. ప్రభుత్వమూ దీనికి నిధులు ఇస్తోంది. కార్యనిర్వాహక మండలి సమావేశం జనవరి 30న జరిగింది. ఫిబ్రవరి 6వ తేది వరకు పెంచనున్న ఛార్జీల వివరాలను నిమ్స్ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రకటిస్తారు. కానీ నిమ్స్ కార్యనిర్వాహక మండలి సమావేశం నిర్ణయాలు వెల్లడించరు.
నిధుల కొరత ?
ఆదాయం ఎలా పెంచుకోవాలనేదానిపై దృష్టిపెట్టిన నిమ్స్ నిధుల కొరతతో కొట్టమిట్టాడుతోందా? అనే సందేహం తలెత్తుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌కు రూ. 68,51,83,000 ఇచ్చింది. పైగా నిమ్స్ ఆసుపత్రి ఎప్పుడూ అవుట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్, ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంది. వైద్యం అందించడం ద్వారా కోట్లలో ఆదాయమూ వస్తుంది. నిమ్స్‌కు ఆరోగ్యశ్రీ నుంచి రూ.25 కోట్లు, ఇఎస్‌ఐ నుంచి రూ.12 కోట్లు, సిజిహెచ్‌ఎస్ నుంచి రూ.15 కోట్లు, ఆర్టీసి రూ. 7 కోట్లు మొత్తం 69 కోట్ల రూపాయల బకాయిలు రావాలి. కానీ వీటిని తెచ్చుకోవడానికి నిమ్స్ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. బకాయి డబ్బులు తెచ్చుకోలేకపోతుందంటే నిమ్స్ పరిపాలన అధికారుల అసమర్థత స్పష్టంగా బయటపడుతోంది. గత ఏడాది వైద్య, ఆరోగ్య శాఖపై ఏర్పాటు చేసిన స్థాయి సంఘం సమావేశంలో అప్పటి డైరెక్టర్ ధర్మరక్షక్ పాల్గొన్నారు. నిమ్స్‌ను అభివృద్ధి చేయడానికి రూ.700 కోట్లు అవసరమన్నారు. తక్షణం రూ.100 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. నిమ్స్‌కు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు నిధులివ్వకుండా వీటిని దెబ్బతీసింది. కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడుతూ నాణ్యమైన వైద్యం అందిస్తున్న నిమ్స్‌ను నాశనం చేయడానికి ప్రభుత్వం ఈ ఆదాయం పెంచే కార్యక్రమాన్ని చేపట్టిందనే విమర్శలొస్తున్నాయి.
పేదవాడిపై భారం మోపినట్లే
నిమ్స్‌లో జనరల్ వార్డు బెడ్‌ఛార్జీ, ఐసియు రేట్లు పెంచడాన్ని అంగీకరించనని నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు స్పష్టం చేశారు. ఇలా పెంచినప్పుడు ఎందుకు పెంచారని ప్రభుత్వమే నిమ్స్‌ను ప్రశ్నించాలన్నారు. ధరలు పెంచడమంటే పేదవాడిపై భారం మోపినట్లేనని, అవసరమైతే నిధులు మేం ఇస్తామని ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.
లాభాల కోసం ఏర్పాటు చేయలేదు
'లాభాల కోసం నిమ్స్‌ను ఏర్పాటు చేయలేదు. నిమ్స్ సంస్థ ప్రజలది. ఇలాంటి సంస్థలు లాభాల కోసం చూడవు. ప్రభుత్వమే సహాయం చేయాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి' అని నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డి.రాజారెడ్డి తెలిపారు. తాను నిమ్స్‌కు డైరెక్టర్‌గా ఉప్పుడు ఆదాయం ఐదు కోట్ల రూపాయలు ఉండేదని, సమర్థవంతంగా పనిచేయడం వల్ల దీన్ని రూ.18 కోట్లకు పెంచామని చెప్పారు.

No comments:
Post a Comment