-విడుదలకు మోకాలొడ్డుతున్న ఆర్థిక శాఖ
-పండగలకు దూరం- అప్పులతో జీవితం
-సిఎం, మంత్రి జోక్యం చేసుకోవాలి : భూపాల్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
104 ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసు ఉద్యోగులు నాలుగు నెలల నుంచి జీతాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జీతాల్లేవు. దీంతో ఉద్యోగులు దసరా, దీపావళి, క్రిస్టమస్, సంక్రాంతి పండగలకు దూరంగా ఉన్నారు. సకాలంలో జీతాలు లేక అప్పులతో జీవితం గడుపుతున్నారు. 3వ త్రైమాసికంలో రూ.12.5 కోట్లు విడుదల చేయడంలో ఆర్థిక శాఖ మోకాళ్లడ్డుతోంది. జీతాలు విడుదల చేయించడంలో ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి జోక్యం చేసుకోవాలని 104 కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు.
104 ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, వాహనాల్లో మందులకు ఏడాదికి రూ.65 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.50 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే రూ.15 కోట్ల లోటు ఉంది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు విడుదల చేశారు. 2013 సంవత్సరం అక్టోబర్ నుంచి జనవరి వరకు జీతాలు రాలేదు. ఎప్పుడైనా జీతాలు వస్తాయనే ఆశతో పనిచేస్తున్నారు. 3వ త్రైమాసికంలో వీరి జీతాల కోసం రూ.12.5 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన బిల్లు ట్రెజరీకి వెళ్లింది. కోటి రూపాయలు దాటిన బిల్లులను పాస్ చేసే అధికారం ట్రెజరీకి లేకపోవడంతో దీన్ని ఆర్థిక శాఖకు పంపించారు. ఆర్థిక శాఖకు బిల్లు వచ్చి రెండు నెలలైనా పాస్ కాలేదు. 104 సర్వీసుల బిల్లు తర్వాత వచ్చిన 108 అత్యవసర వైద్యసేవలకు సంబంధించిన బిల్లును మాత్రం ఆర్థిక శాఖ వెంటనే పాస్ చేసింది. 'పై స్థాయి' నుంచి ఒత్తిడి చేస్తే తప్ప బిల్లు పాస్ చేయని పరిస్థితి ఆర్థిక శాఖలో నెలకొన్నది. 3వ త్రైమాసికంలో విడుదల కావాల్సిన రూ.12.5 కోట్ల రూపాయలు ఇంకా విడుదల కాలేదు. నాలుగో త్రైమాసికం నిధులు విడుదల చేయాలని అధికారులు కోరితే 3వ త్రైమాసికం నిధులు ఖర్చు చేయలేదని, అవి ఖర్చు చేశాకే విడుదల చేస్తామని ఆర్థిక శాఖ అంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి నెల జీతం కోసం మరో నాలుగైదు నెలలు ఆగాల్సిందే.
జీతాలు వెంటనే విడుదల చేయాలి : భూపాల్
104 వైద్య సర్వీసు ఉద్యోగులు జీతాల్లేక బలైపోతున్నారని104 కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకుండా, 104 సర్వీసులు నడవకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని విమర్శించారు. వెంటనే జీతాలు విడుదల చేయించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో లేకుండా పూర్తి స్థాయి బడ్జెట్‌ను విడుదల చేయాలన్నారు. 104 వాహనంలో తప్పనిసరిగా ఒక డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 104 వైద్య సర్వీసుల వైఫల్యాలకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులు కూడా బాధ్యత వహించాలన్నారు.
శివరాత్రికైనా వస్తాయా?
దసరాకు జీతాలు వస్తాయని ఒకసారి, దీపావళికి వస్తాయని ఇంకోసారి, క్రిస్టమస్ పండక్కి వస్తాయని మరోసారి ఇలా ప్రతీ పండక్కి అధికారులు చెబుతూనే ఉన్నారని 104 కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాగర్ తెలిపారు. శివరాత్రికైనా వస్తాయని ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జీతాలే కాక రోజూ డ్యూటీ చేసినందుకు ఇచ్చే రూ.70 భోజనం అలవెన్సు కూడా ఏడాదిగా ఇవ్వడం లేదన్నారు. ప్రతీ పండగ ముందు జీతాలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం, జీతాల్లేక పండగరోజు పిల్లలకు బట్టలే కాక కనీసం స్వీట్లు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు నెలలకోసారి వచ్చే జీతం అంతకు ముందు చేసిన అప్పు చెల్లించడానికే సరిపోతుందన్నారు. ఇక మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక లక్ష్మణ్ అనే ఫార్మాసిస్టు ఆత్మహత్య ప్రయత్నం చేసి చనిపోయాడని 104 ఉద్యోగి సంతోష్ కుమార్ తెలిపారు. జీతాల్లేక ఉద్యోగులు పడే ఆవేదన, ఆందోళన ఉన్నతాధికారులకు అర్థం కావడం లేదన్నారు.

No comments:
Post a Comment