Tuesday, March 25, 2014
లోగుట్టు ఎవరికెరుక?
-నాలుగేళ్లయినా పూర్తికాని 'రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్'
-రూ.63 కోట్లకు చేరిన అంచనాకు తెలియదంటే.. నాకు తెలియదంటున్న ఉన్నతాధికారులు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలోనే టెరిషరి కేర్ అందించే ఏకైక చిన్న పిల్లల ఆసుపత్రి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రి. ఇక్కడికి రోజూ దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులను రిఫర్ చేస్తుంటారు. వసతులకు మించి చికిత్స జరుగుతుంది. అలాగే మరణాలూ పెద్ద ఎత్తున సంభవిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2008లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ అవసరాలు ఆసరాగా చేసుకుని కొందరు తమ తెలివిని ఉపయోగించుకుని అంచనాలను భారీగా పెంచి నిర్మాణ పనులను కూడా జాప్యం చేస్తున్నారు.
నిలోఫర్ ఆసుపత్రి ఆవరణలో 13825.5 చదరపు అడుగుల స్థలంలో 450 పడకలతో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అక్టోబర్ 6, 2009లో ఉత్తర్వు జారీ అయ్యింది. ఎన్ఆర్హెచ్ఎం కింద రూ.20.60 కోట్ల నిధులతో ఈ నిర్మాణం చేపట్టారు. ఇందులో రెండు సెల్లార్లు, ఐదు ఫ్లోర్లు ఉండేలా డిజైన్ చేశారు. అప్పటికే దీని కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడమే కాక, కాంట్రాక్టరుతో ఒప్పందం కూడా పూర్తయ్యిందని జిఓలో పేర్కొన్నారు. ఆ తర్వాత 21693.20 చదరపు అడుగులలో దీన్ని నిర్మిస్తున్నామని, నిర్మాణ బడ్జెట్‌ను రూ.27.60 కోట్లకు పెంచారు. అంచనా ప్రకారం నిర్మాణ పనులు 18 నెలల్లో అంటే ఏప్రిల్, 2011లో పూర్తవ్వాలి. నవంబర్ 2010లో జిఓ నం.318ని జారీ చేసి భనవ నిర్మాణానికి యూనిసెఫ్ నుంచి సాంకేతిక సలహా తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాక కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఈ నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షించాలని, నెల వారి పనితీరు నివేదికను ప్రభుత్వానికి పంపాలని చెప్పారు.
ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే సమయానికి, విజయవంతంగా ఈ ప్రాజెక్టు పూర్తవడంలో వైద్య విద్య సంచాలకులదే (డిఎంఇ) బాధ్యత అని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. ఇక్కడ వింత ఏమిటంటే నిర్మాణ పనులు సాగుతూ సాగుతూ వచ్చి జూన్, 2013లో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ వెళ్లింది. దీన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం అక్టోబర్ 23, 2013లో జిఓ నం.168 ఉత్తర్వును విడుదల చేస్తూ సివిల్ పనుల బడ్జెట్‌ను రూ.48 కోట్లకు, పరికరాలకు బడ్జెట్ రూ.15 కోట్లు పెంచింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బిసి) నిబంధనల ప్రకారం భూకంప లోడును (సెస్మిక్ లోడ్) పరిగణలోకి తీసుకుంటూ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్‌ను సవరించడం వల్ల సివిల్ పనులు ఖర్చులు పెరిగాయని పేర్కొన్నారు.
సెస్మిక్లోడ్ పేరుతో రూ.20 కోట్ల పెంపు
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భవన నిర్మాణం మొదలుపెట్టే కన్నా నాలుగేళ్ల ముందుగానే 2005లోనే ఎన్బిసి వచ్చింది. నిర్మాణ పనులకు అనుమతినిచ్చింది 2009లో, సవరించింది 2013లో అంటే, 8 ఏళ్ల వరకు ప్రభుత్వానికి ఎన్బిసి ఉందని తెలియదా? అనే సందేహం కలుగుతోంది. ఒక భవన నిర్మాణం చేసేటప్పుడు భూమి పరీక్ష (సాయిల్టెస్ట్), సెస్మిక్ లోడ్ పరీక్షలు పూర్తి చేసి, నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్కు అనుమతినిచ్చిన తర్వాతనే నిర్మాణం చేపడతారు. అంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అనుమతిలేకుండానే 2009లో నిర్మాణం చేపట్టారా?. నాలుగేళ్ల తర్వాత సెస్మిక్లోడ్ కోసమే అదనంగా రూ.20 కోట్లను దీని కోసమే పెంచామని అంటున్నారు. ఈ పెంచడం వెనక ఎవరి హస్తలాఘవం ఉందో తెలియాలి.
టూల్ కిట్ వల్ల ఆలస్యం
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 'టూల్ కిట్' - ప్రసవ గది (లేబర్ రూం) డిజైన్, ఇతర డిజైన్ల వల్ల భవన ప్రారంభం ఆలస్యమవుతోందని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.దేవరాజ్ తెలిపారు. ఎందుకు నిర్మాణ పనులు ఆసల్యమవుతున్నాయో?, ఎందుకు అంచనా పెరిగిందో చెప్పలేకపోయారు. అంటే తన ఆవరణలో జరుగుతున్నా బిల్డింగ్ నిర్మాణ పనుల వివరాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది.
నాకు తెలియదు
సమయానికి, విజయవంతంగా ఈ ప్రాజెక్టు పూర్తవడంలో వైద్య విద్య సంచాలకులదే బాధ్యత అని ఉత్తర్వులో ఉండటంతో నిర్మాణ పనుల జాప్యం గురించి 'ప్రజాశక్తి' సంచాలకులు డాక్టర్ శాంతా రావును సంప్రదిస్తే, దీని గురించి నాకు తెలియదన్నారు. ఈ నాలుగేళ్లలో ఐదుగురు వైద్యవిద్య సంచాలకులు మారారు. డిఎంఇకి అన్ని విషయాలు చెబితే తమ ఆటలు సాగవని భావించి ఈ వివరాలు చెప్పడం లేదా? అనేది బయటికి రావాల్సి ఉంది.
స్టడీ చేయలేదు
భవన నిర్మాణ పనులు ఆలస్యం, నిర్మాణం ఖర్చు రెట్టింపు ఎందుకు అయ్యిందని ప్రజాశక్తి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజరు సాహ్నిని అడిగింది. డిఎంఇని అడిగితే తెలియదంటున్నారని ప్రస్తావించింది. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ఎపిఎంఎస్ఐడిసి చూస్తోంది కదా? అని చెప్పారు. భవన పనుల ఆలస్యం, అంచనా రెట్టింపు గురించి తెలియదని, దీని గురించి స్టడీ చేయలేదన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సెస్మిక్ లోడ్ వల్ల సివిల్ పనుల ఖర్చు పెరుగుతుందని, అంచనాను రూ.48 కోట్లకు పెంచిన ఉత్తర్వు ఇచ్చింది కూడా అజరు సాహ్నియే.
నిర్లక్ష్యానికి మూల్యం శిశుమరణాలు
2011లో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ పూర్తయ్యి ఉంటే నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలందేవని, మరణాలు రేటు గణనీయంగా తగ్గేదని నిలోఫర్ ఆసుపత్రిలోని ఒక డాక్టర్ అభిప్రాయపడ్డారు. త్వరిత గతిన భవన నిర్మాణ పనులు పూర్తయితే ఏడాదికి సుమారుగా 5 వేల మంది శిశువులను కాపాడే వీలుండేది. కానీ నత్తకు నడక నేర్పేలా నిర్మాణ పనులు కొనసాగుతుండం వల్ల 2012, ఆగస్టులో 15న 21మంది శిశువులు చనిపోయారు. 2013, మే నెల చివరి వారంలో నిలోఫర్ ఆసుపత్రిలో 93 మంది శిశువులు మరణించారు. ఒక సారి ఈ గణాంకాలను పరిశీలిస్తే శిశుమరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. 2008లో 2106 మంది శిశువులు, 2009లో 2233, 2010లో 4,296, 2011లో 3,447 , 2012 ఆగస్టునాటికి 2,122 మంది శిశువులు చనిపోయారు. ఇప్పటికైనా బిల్డింగ్ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి శిశుమరణాల రేటను తగ్గిస్తారో? లేదో? ఉన్నతాధికారులే చెప్పాలి. అలాగే ఆలస్యానికి బాధ్యులపై ఏవైనా చర్యలు తీసుకుంటారారో వేచి చూడాల్సిందే.
Thursday, March 20, 2014
అంతా ఆమె చేతిలోనే...
-నిబంధనలు తుంగలో తొక్కి అధికారం కేంద్రీకృతం
-రహస్య జిఓ మర్మం?
-అక్రమంగా 130కిపైగా బదిలీలు
- వైద్య విధాన పరిషత్‌లో ఎస్సీ బ్యాక్‌లాగ్‌లో దళితులకు అన్యాయం
-పోరాటం చేస్తాం : కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌లో (ఎపివివిపి) కీలకమైన స్థానాల్లో కమిషనర్, ముగ్గురు జాయింట్ కమిషనర్లు, ఒక విజిలెన్స్ అధికారి, కార్యదర్శి ఉంటారు. 2012 వరకు ఈ స్థానాలను అన్ని అర్హతలున్న సీనియర్లతో నింపుతూ వచ్చారు. ప్రతీ సంవత్సరం ఆగస్టు 31వ తేది నాటికి సీనియారిటీ జాబితా సిద్ధం కావాలి. దీని ప్రకారం ఖాళీలను డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీ ద్వారా భర్తీ చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో ముగ్గురు అర్హులు ఉన్నప్పటికీ వీరిని కాదని విజిలెన్స్ అధికారిగా ఉన్న డాక్టర్ పి.కనకదుర్గమ్మతో జనవరిలో కమిషనర్ పోస్టును భర్తీ చేశారు. కేవలం తమ సీనియారిటీపైనే ఆధారపడి, సీనియారిటి ప్రాతిపదికన ప్రభుత్వం పదోన్నతి కలిగిస్తుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. లంచాలివ్వలేక, సచివాలయం చుట్టూ తిరగలేక, పైరవీలు చేయలేక పోయిన వారికి పదోన్నతులు దక్కడం లేదని తెలిసింది.
పక్కా స్కెచ్‌తోనే..
2012 నవంబర్, 27 నాటికి సీనియార్టి ఆధారంగా విజిలెన్స్ అధికారిని నియమించాలి. కానీ నలుగురు సీనియర్లున్నప్పటికీ వారికి కాదని 2013 డిసెంబరులో డాక్టర్ పి.కనకదుర్గమ్మకు విజిలెన్స్ అధికారిగా పదోన్నతి ఇచ్చారు. ఆ తర్వాత జాయింట్ కమిషనర్ (జనరల్) అధికారాలిచ్చారు. సీనియారిటీ ఆధారంగా కమిషనర్‌ను నియమించాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దీన్ని తుంగలో తొక్కి కనకదుర్గమ్మకు 2014 జనవరిలో కమిషనర్‌గా పదోన్నతి కల్పించారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఎపివివిపి కమిషనర్ డాక్టర్ పి.కనకదుర్గమ్మ చేతిలో కమిషనర్ పోస్టుతోపాటు మరో నాలుగు కీలకమైన 3 జాయింట్ కమిషనర్, ఒక విజిలెన్స్ అధికారి పోస్టులున్నాయి. సమర్థురాలని ఇన్ని పదవులు అప్పగించారు. కానీ ఈ సమర్థతను వేరే విధంగా వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒకే అధికారి వద్ద ఇన్ని పదవులు ఉండటం వల్ల వైద్యవిధానపరిషత్లో పరిపాలన కుంటుపడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫైళ్ల విభజన సమగ్రంగా జరగడం లేదు. నెమ్మదిగా జరుగుతున్నాయి. మరో కీలకమైన ఎపివివిపి సెక్రెటరీ పోస్టులో అర్హతలేని, ఆరోపణలున్న, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని ఈ కమిషనర్‌తోపాటు నియమించారని తెలిసింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి టిజి వెంకటేష్ వద్ద కొంత మంది కాంట్రాక్టర్లు కనకదుర్గమ్మను కమిషనర్ చేయాలని లాబీయింగ్ చేశారని సమాచారం. ఈ మధ్య కాలంలో వైద్య, ఆరోగ్య శాఖలో వెలువడిన వివాదాస్పద జిఓలపై గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి ఉత్తర్వులపై గవర్నర్ సమీక్ష చేయనున్నారని సమాచారం.
దళితులకు అన్యాయం
వైద్యవిధాన పరిషత్‌లో ఆరు డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు న్నాయి. సర్వీసు రూల్స్ ప్రకారం ఆరు పోస్టులుంటే ఒక పోస్టు ఎస్సీలకు కేటాయించాలి. ఇక్కడా దళితులకు అన్యాయం జరిగింది. డబ్బులకు కక్కుర్తిపడి దళితులు కాని వారిని ఈ పోస్టులో నియమిస్తున్నారు. ఈ బ్యాక్లాగ్పోస్టు గత 3 ఏళ్లుగా ఖాళీ ఉందని చూపిస్తూ దళితులు కానీ వారిని రూ.15 నుంచి రూ.20 లక్షలు తీసుకుని నియమిస్తున్నారని భోగట్టా. ఈ విషయమై సిపిఎం శాసనసభ పక్షనేత జూలకంటి రంగారెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి, నివేదికను పంపాలనే ఆదేశాలు అందాయని సమాచారం. అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్న కనకదుర్గమ్మ దళితుడు కాని వారిని రివర్ట్ చేయాలని, దళితున్ని ఈ పోస్టులో నియమించాలని అక్టోబరులో నివేదిక ఇచ్చారని తెలిసింది. ఇప్పుడు ఆమె కమిషనర్‌గా ఉన్నారు. కొన్ని ప్రయోజనాల కోసం ఈ రిపోర్టును తొక్కిపెట్టారనే ఆరోపణ ఉంది. విజిలెన్స్ స్థాయి అధికారి న్యూట్రల్‌గా ఉండాలి. తాను విజిలెన్స్ అధికారిగా ఉన్నప్పుడు ఒకలాగా, కమిషనర్ అయ్యాకా ఇంకోలాగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రెండు నెలల్లో 130కిపైగా అక్రమ బదిలీలు!
కమిషనర్ అయ్యాక కనకదుర్గమ్మ తన సమర్థతను బదిలీల ద్వారా చూపించుకున్నారని భొగట్టా. రెండున్నర నెలల్లో వైద్యవిధానపరిషత్లో సుమారు 139 మందికిపైగా డాక్టర్లు, నర్సుల బదిలీ చేశారని తెలిసింది. ఒక వైపు రాష్ట్ర విభజన జరుగుతోంది, మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినా వీటిని బేఖాతరు చేయకుండానే బదిలీలు అవుతున్నాయని సమాచారం. డాక్టర్ పోస్టుకు రూ.లక్ష, నర్సు పోస్టుకు రూ.30 వేల లంచం ఇచ్చిన వాళ్లకే బదిలీలు అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. విజిలెన్స్ విచారణ, ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నా కూడా బదిలీలు చేశారు. అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణను ఎదర్కొంటున్న ఒక అధికారి అమెరికా వెళ్లడానికి ఏకంగా అనుమతి కూడా ఇచ్చారని తెలిసింది.
అంత రహస్యం ఎందుకు?
ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ను హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి బదిలీ చేస్తున్న ఉత్తర్వును ఎపి ఆన్లైన్ వెబ్సైట్లో పెట్టారు. వైద్యవిధానపరిషత్ కమిషనర్ నియామకానికి సంబంధించిన కూడా జిఓ ఉంటుంది. కానీ దీన్ని చూడ టం సాధ్యం కాదు. ఎందుకంటే 'కాన్ఫిడెన్షియల్' అని పేర్కొన్నారు. ఎందుకింత రహస్యంగా జిఓ ఇవ్వడమనే అనుమానం కలుగుతుంది. అనుభవం, నైపుణ్యం, పనితీరు ఆధారంగా కమిషనర్ ఎంపిక కావాలి. కానీ ఈ పోస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎపివివిపి ఆసుపత్రులకు స్టేషి నరీ సరఫరాదారులు, సివిల్ వర్క్ కాంట్రాక్టర్లు/ఇంజనీర్లు పెట్టుబడ ిపెడతారని, కమిషనర్ పోస్టుకు అవసరమయ్యే లక్షల రూపాయలు వీరు ఖర్చపెడతారనే విమర్శలున్నాయి. తమ వ్యక్తి కమి షనర్ అయితే కోరుకున్న రేటుకు కోట్లలో కాంట్రాక్టును సులువుగా సంపాదిం చుకోవాలన్నదీ వీరి వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 'కమిషనర్ ఎంపిక ఎవరి చేతుల్లో' అని గతంలోనే 'ప్రజాశక్తి' కథనాన్ని ప్రచురించింది. కథనంలాగే ఎంపిక జరిగిందని వైద్యనిపుణులు భావిస్తున్నారు.
రాజ్యాంగా విరుద్ధం
రోస్టర్ విధానం ఉపయోగించుకుని చాలాచోట్లా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కును కాలరాస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కులవివక్ష వ్యతిరేక పోరాటం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్‌లోనే కాక రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా రిజర్వేషన్‌ను తుంగలొ తొక్కుతున్నారని విమర్శించారు. చాలా తక్కువ సమయాల్లో ఇలాంటివి బయటపడుతున్నాయన్నారు. దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు రావాల్సిన సౌకర్యాలు రాకుండా చేస్తున్నారని చెప్పారు. తప్పు రుజువైన సందర్భాల్లో బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల పదేపదే పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న ఇలాంటి అన్యాయాలపై కెవిపిఎస్ ఆందోళన నిర్వహిస్తుందని, కలిసొచ్చే సంఘాలతో పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Wednesday, March 19, 2014
Tuesday, March 18, 2014
పిజి మెడికల్ స్కామ్ మూడు కన్సల్టెన్సీల పనేనా?
- లబోదిబోమంటున్న విద్యార్థులు
ప్రజాశక్తి -హైరాబాద్ బ్యూరో
వైద్య విద్య కార్పోరేట్ చేతుల్లోకి వెళ్తోంది. ఎంబిబిఎస్ సీట్లు మొదలుకొని పిజి సీట్ల వరకు రూ.కోట్లలో దండుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా పిజి ప్రవేశ పరీక్షపై కన్సల్టెన్సీలు కన్నెశాయి. ఏకంగా ప్రవేశపరీక్షను లక్ష్యం చేసుకుని ర్యాంకులు తెప్పిస్తామని లక్షలు వసూలు చేస్తున్నాయి. చివరకు ఇవి బోర్డు ఎత్తేయడంతో అసలు విషయం బయటపడింది.
పిజి సీట్లు పొందాలంటే రెండు రకాల మార్గాలున్నాయి. ఒకటి ఎంబిబిఎస్ తర్వాత రూరల్ సర్వీసు చేయడం. అంటే రెండేళ్లపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలందించడం. ఇలా సర్వీసు చేసిన వారికి పిజి ప్రవేశ పరీక్షలో వెయిటేజ్ ఉంటుంది. అయితే ఈ సర్వీసుపై అనేక విమర్శలున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారితో కుమ్మక్కై కొంత మంది గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సర్వీసు చేయడం లేదు. కానీ చివరికి సర్వీసు చేసినట్లు పత్రం పొందుతున్నారు. ఇంక రెండో పద్ధతి కష్టపడి ప్రవేశ పరీక్ష రాయడం. మంచి ర్యాంకు వస్తే సరేసరి, రాకుంటే ప్రైవేటు వైద్యకళాశాలల్లో సీటు కొనుక్కోవడం. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ప్రైవేటు వైద్య కళాశాలల్లో రేడియోలజీ సీటు రూ.3 నుంచి 4 కోట్లు, ఆర్థోపెడిక్ రూ.కోటి నుండి రూ.2 కోట్లు, పీడియాట్రిక్, అనస్థీషియా రూ. కోటి నుండి రూ.1.50 కోట్ల వరకు, ఇతర విభాగాల సీట్లు కోటి రూపాయలకు పలుకుతున్నాయి. గత ఏడాదిలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరి గాయి. అర్హులైన వాళ్లు కోర్టుకు కూడా వెళ్లారు. రూరల్ సర్వీసు చేసిన వారికి పిజిలో ప్రవేశంలో వెయిటేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే సుమారు 25 వేల మంది దరఖాస్తుచేసుకున్నారు. అవకతవకల్లో ఎక్కువగా విదేశాల్లో ఎంబిబిఎస్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఉన్నారు.
మూడు కన్సల్టెన్సీలు...
పిజి ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరగడానికి మూడు కన్సల్టెన్సీలు కారణమని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈ కన్సల్టెన్సీలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్, పిజి సీట్లు ఇప్పించే పనులు చేస్తుంటాయి. కానీ ఈ సారి ఇవి మూడు అడుగులు ముందున్నాయి. పిజి ప్రవేశ పరీక్ష రాసి, ర్యాంకులు సరిగ్గా రాక, కోట్ల రూపాయలు ఖర్చుచేయడం ఎందుకనే ఆలోచన వచ్చింది. ఇందులో కొంత డబ్బు ఖర్చుపెడితే ఏకంగా పిజి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని భావించారు. దీని కోసం ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఎంత చదివినా మంచి ర్యాంకులు రావనే విద్యార్థులను పట్టారు. చర్చలు జరిపారు. ఒక్క విద్యార్థి నుంచి రూ.50 లక్షలు వసూలు చేయాలని భావించారు. ముందస్తుగా రూ.25 లక్షలు, ఎంబిబిఎస్ ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టాలని నిబంధన పెట్టారు. ర్యాంకు వస్తే అదే పదివేలు అనుకున్న విద్యార్థులు డబ్బుతోపాటు సర్టిఫికేట్‌కూడా ఇచ్చారు. అనుకున్న ప్రకారం వీరు డబ్బులు కట్టిన వారికి ప్రశ్నపత్రం ఔట్ చేశారని, కచ్చితమైన సమాధానాలను కూడా రాసి ఇచ్చారని తెలిసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, ఇక్కడ ఈ ప్రశ్నలు-సమాధానలతో ప్రిపేర్ అయితే అనుమానం వస్తుందని కన్సల్టెన్సీలు ముందగానే పసిగట్టాయి. అందుకే ఈ విద్యార్థులందరినీ రాష్ట్రం దాటించారు. అక్కడే ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో ప్రాక్టీస్ చేయించారు. మార్చి 2న జరిగే పిజి ప్రవేశ పరీక్ష సమాయానికి వీరంతా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. అందరూ ఉత్సాహంగా పరీక్ష (మాస్కాపీయిగ్?) రాశారు. మార్చి 15న ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చాయి. మంచి ర్యాంకుల రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇక డిమాండ్ ఎక్కువున్న పిజి సీట్లు తమవేననే ఊహల్లో విహరించారు. ఇంతలో వీరికి అనుకోని షాక్ తగిలింది. డబ్బులతోపాటు, ఎంబిబిఎస్ సర్టిఫికేట్ తీసుకున్న కన్సల్టెన్సీలు ఊడాయించాయని, ఆ తర్వాతే ఈ విషయం బయటికి పొక్కిందని సమాచారం. అదనంగా మరింత డబ్బు గుంజడానికి కన్సల్టెన్సీలు ఈ ఎత్తు వేశాయని అంటున్నారు. ఇక పేపర్ ఔట్ అవడంలో ఎన్టీఆర్ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి చెందిన ఉన్నతాధికారుల పాత్ర ఉందని విమర్శలు వినవస్తున్నాయి. ఎపి పిజి ప్రవేశ పరీక్షలో జగదీప్ అనే విద్యార్థికి 12వ ర్యాంకు వచ్చింది. ఇతను ఇంతకు ముందు పిజి ప్రవేశపరీక్షలో జరిగిన స్కాం కేసులో ఎ2 ముద్దాయి. రెండు నెలలు జైలులో శిక్ష అనుభవించాడు. అకస్మాత్తుగా ఇక్కడ ఎలా పరీక్ష రాశారో ఎవరికీ తెలియదు. అవకతవకలు జరిగాయడానికి జగదీప్ ఒక ఆధారమని ఎపిజుడాలు అంటున్నారు. సమాజంలో విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్ సంస్కృతి వస్తే ఆ సమాజం భ్రష్టుపట్టినట్టే అని అంటారు. ఇప్పుడదే జరుగుతోంది. ప్రభుత్వ విధానాల వల్ల రాను రాను వైద్య విద్య దిగజారుతోంది. లక్షల రూపాయలు చెల్లించి, ర్యాంకులు కొనుకున్న వారు డాక్టర్లయితే, భవిష్యత్‌లో పేదలకు ఎలా వైద్య సేవచేస్తారు?. ఇలాంటి పరిస్థితే కొనసాగితే కొన్నాళ్లయితే డబ్బులున్న వారికే వైద్యం అందుతుంది. వైద్య వ్యవస్థలో జరిగే ఇలాంటి అనైతిక పద్ధతులను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది.

పిజి మెడికల్ ఎంట్రెన్స్ అవకతవకలు విచారణకు ఆదేశం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
పిజి మెడికల్ ప్రవేశపరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని గవర్నర్ ఇఎల్ నరసింహన్ ఆదేశించారు. అవకతవకలపై విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్వి వేణుగోపాల్ రెడ్డిని గవర్నర్ నియమించారు. సాయంత్రం లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గవర్నర్‌ని కలిసి పిజి ప్రవేశపరీక్ష జరిగిన అవకతవకల గురించి వివరించారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ జూనియన్ డాక్టర్స్ అసోసియేషన్‌కు చెందిన వైద్యులు మధ్యాహ్నం గవర్నర్ కార్యదర్శిని కలిశారు. ఈ నెల 2న జరిగిన పిజి ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని ఎపిజుడా మాజీ అధ్యక్షులు అభిలాష్, రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, సాగర్ బృందం గవర్నర్ కార్యదర్శిని కోరారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. ఈ అవకతవకల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దాదాపు 100 సీట్లు అమ్ముకున్నదని ఆరోపించారు. ఒక్కో ర్యాంకు కోసం రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టారని, మొత్తంగా రూ.150 కోట్ల స్కాం అని విమర్శించారు. స్కాం గురించి గవర్నర్ కార్యదర్శికి పూర్తిగా వివరించామని అన్నారు. కార్యదర్శి పాజిటివ్‌గా స్పందించారని సంతృప్తిని వ్యక్తం చేశారు. పిజిసీట్ల ర్యాంకులపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని కార్యదర్శి చెప్పారని వెల్లడించారు. ఎపిజుడా, ఇతర ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని, విచారణలో వెల్లడైన దాన్ని బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పారని తెలిపారు. ఈ విషయమై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌తో మాట్లాడతానని కార్యదర్శి చెప్పారన్నారు. పిజి మెడకిల్ ప్రవేశ పరీక్షలో అనేక అక్రమాలు చోటు చేసుకున్న దృష్ట్యా తిరిగి పరీక్షలు నిర్వహించాలని విజయవాడలోని ఎన్టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. తిరిగి పరీక్షలు నిర్వహిం చాలని యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బాబూలాల్‌కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు.

Monday, March 17, 2014
నాణ్యతా విధానం లేకుండానే కొనుగోళ్లు
- నైపుణ్యంలేని బృందం
- మొద్దునిద్రలో విజిలెన్స్ శాఖ
- పట్టనట్టు వ్యవహరిస్తున్న డ్రగ్ కంట్రోల్ అథారిటీ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఎపిఎంఎస్ఐడిసి కొనే మందులు సుమారు 15 వేల నుంచి 20 వేల బ్యాచ్‌లలో సరఫరా అవుతాయి. అయితే ఇందులో నాణ్యతా పరీక్ష నిర్వహించేది కేవలం 3000 నుంచి 4000 బ్యాచ్‌లకు మాత్రమే. అంటే 25 శాతం బ్యాచ్‌లకు మాత్రమే పరీక్ష చేస్తున్నారు. ఇదే కాక నాణ్యతా రిపోర్టు రావడానికి మూడు నెలలకుపైగా సమయం పడుతుంది. కానీ అప్పటికే మందులు ఆసుపత్రులకు చేరతాయి. మందులను రోగులు వాడటం కూడా పూర్తవుతుంది. ఫలితంగా ఈ మందులతో రోగాలు నయం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం, డాక్టర్ల ప్రయత్నం నీరుకారుతోంది. కొత్త కొనుగోళ్ల విధానం వచ్చి ఇప్పటికీ ఐదేళ్లవుతోంది. ఇప్పటికీ పాత పద్ధతిలోనే మందులు కొనుగోళ్లుచేస్తున్నారు. ఇప్పటి వరకు మందుల నాణ్యతకు సంబంధించిన క్వాలిటీ పాలసీని ఎపిఎంఎస్ఐడిసి రూపొందించలేదు. కొనుగోళ్ల విధానం ప్రకారం ఒక మందుకు నాట్ ఆఫ్ స్టాండర్ట్ క్వాలిటీ (ఎన్ఎస్క్యూ) రిపోర్టు వస్తే ఆ మందును బ్లాక్‌లిస్టులో పెట్టాలి. అలాగే రెండు రకాల మందులు ఇలా బ్లాక్‌లిస్టులోకి వెళ్తే ఆ కంపెనీని 3 నుంచి 5 ఏళ్లు బ్లాక్‌లిస్టులో పెట్టాలి. కాని ఎన్ఎస్క్యూ రిపోర్టులను దాచిపెట్టి బ్లాక్‌లిస్టులోకి వెళ్లాల్సిన కంపెనీలకు ఎపిఎంఎస్ఐడిసి ఆర్డర్లు ఇస్తోందని ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని భోగట్టా.
ఇక్కడా నైపుణ్యంలేని వారే ముఖ్య అధికారులు
మందుల కొనుగోళ్లకు ప్రభుత్వం డబ్బులు కేటాయించినా, అవసరమైన నిపుణులు లేకుండానే ఎపిఎంఎస్ఐడిసి రూ.330 కోట్లు ఖర్చుపెడుతోంది. మందుల కొనుగోళ్లు అనేది మెటీరియల్స్ మేనేజ్మెంట్ అనే శాస్త్రానికి సంబంధించినది. దీని గురించి తెలియని వాళ్లు ఇక్కడ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత గురించి పరిజ్ఞానం లేనివాళ్లు ఇక్కడ నాణ్యత నివేదికలను పరిశీలిస్తున్నారు. సరైన సమయానికి, సరైన చోటికి మందులు పంపించడానికి కీలకమైంది 'లాజిస్టిక్స్'. దీని గురించి ఎలాంటి అనుభవం, అవగాహన లేకుండానే మందులను ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. పక్కనున్న తమిళనాడులో మందుల కొనుగోళ్ల విభాగంలో 60 మంది, రాజస్థాన్‌లో 120 మంది ఆయా రంగాల్లో నిపుణులైన అధికారులున్నారు. కానీ మన రాష్ట్రంలోని ఎపిఎంఎస్ఐడిసిలో కేవలం 9 మందితోనే ఈ మొత్తం పని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే రాజుగారి నూలుపోగు వస్త్రాల కథను గుర్తుకు తెస్తోంది.
జాడలేని విజిలెన్స్ విభాగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం రూ.25 లక్షలపైబడిన కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను, పర్చేజ్ ఆర్డర్ కాపీని విజిలెన్స్ విభాగానికి పంపించాలనే నిబంధన ఉంది. 1998 నుంచి కొనుగోళ్లు జరుగుతున్నా ఎపిఎంఎస్ఐడిసి దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఐఎఎస్ అధికారి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇందులో అంతర్గత విజిలెన్స్ శాఖ ఏర్పాటు కాలేదు. కనీసం రాష్ట్రంలోని విజిలెన్స్ విభాగానికి కూడా ఆర్డర్ కాపీని పంపడం లేదని తెలిసింది. తాము చేసే తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే వీటి ఏర్పాటుకు చొరవ తీసుకోలేదు. 1998 నుంచి మందుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ 15 ఏళ్లలో ఎపిఎంఎస్ఐడిసి ద్వారా రూ.1910 కోట్ల రూపాయల మందులను కొనుగోళ్లు జరిగాయి అంచనా. ఇన్ని కోట్ల రూపాయల కొనుగోళ్లు చేస్తున్నా రాష్ట్ర విజిలెన్స్ శాఖ దీనిపై నామమాత్రమైనా నిఘా పెట్టలేదు. రాష్ట్ర విజిలెన్స్ శాఖ నిద్రపోతుందా? అన్న సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు.
పట్టనట్టు వ్యవహరిస్తున్న డిసిఎ
మందుల నాణ్యతను పరీక్షించడానికి మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రెండు ల్యాబులున్నాయి. ఒకటి హైదరాబాద్‌లో, ఇంకోటి విజయవాడలో. ఇవి డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డిసిఎ) నియంత్రణ కింద ఉంటాయి. ప్రస్తుతం మందుల నాణ్యతను ప్రైవేటు ల్యాబుల్లోనే ఎక్కువగా పరీక్షిస్తున్నారు. మందులను పరీక్షించి నాణ్యమైనవి కావని తేలితే ఎన్ఎస్క్యూ రిపోర్టు వస్తుంది. ఇక్కడే చిన్న కంపెనీలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నాయి. ఒక బ్యాచ్‌లో మంచి నాణ్యత ఉన్న మందులను నమూనాగా పెట్టుకుంటారు. తాము సరఫరా చేసిన మందులకు ఎన్ఎస్క్యూ రిపోర్టు వస్తే తెలివిగా, నాణ్యమైన మందులు పంపించి డిసిఎ నుంచి స్టాండర్డ్ క్వాలిటీ అని రిపోర్టు పొందుతుంటాయి. దీంతో వీరిపై చర్య తీసుకోవడం కష్టమవుతోంది. ఎపిఎంఎస్ఐడిసి కోట్లాది రూపాయల మందులు కొనుగోళ్లు చేస్తున్నారని, ఇంకొన్ని ల్యాబులు నిర్మించాల్సి ఉందని డిసిఎ కూడా ప్రభుత్వానికి నివేదించలేదు. మందుల నాణ్యతను పరీక్షించే ల్యాబులు తక్కువగా ఉన్నాయని సాకులు చెప్పి ఎపిఎంఎస్ఐడిసి తప్పించుకుంటున్నది. మరిన్ని ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పంపలేదు.
ప్రజారోగ్యంపై ఎపిఎంస్ఐడిసికి చిత్తశుద్ది ఎంతుందో దీన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికైనా రాజుగారు-నూలువస్త్రాల కథ నుంచి బయటపడతారా? లేదా? అనేది ఎపిఎంఎస్ఐడిసి నిర్ణయించుకోవాలి.
లొసుగులున్నమాట వాస్తవమే : ఎపిఎంఎస్ఐడిసి ఎమ్‌డి
ప్రజాశక్తి కథనానికి స్పందన
ఆదివారం ప్రజాశక్తి ప్రచురించిన 'నమ్మకానికి తూట్లు' అనే కథనానికి ఎపిఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ముద్దాడ రవిచంద్ర స్పందించారు. మంచి కథనాన్ని ప్రచురించారని ప్రశంసిస్తూనే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నాణ్యతా పరీక్షల్లో లొసుగులున్నాయని, మందుల నాణ్యతా పరీక్ష బాగాలేదని అంగీకరించారు. అయితే కథనంపై రవిచంద్ర ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. లోపాలు ఉన్నాయంటూనే బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పలేదు. వినియోగదారుని స్థాయి వరకు పూర్తి కంప్యూటరైజేషన్ అయితేగాని కచ్చితమైన ఇన్వెంటరీ మేనేజ్మెంట్ను నిర్వహించలేమన్నారు. కంప్యూటరైజేషన్‌కు, మందుల క్వాలిటీకి సంబంధం ఏమిటి?. కానీ ఇప్పటికే కంప్యూటరైజేషన్‌పై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని తెలిసింది. ఇక మందులకు సంబంధించి 3 నుంచి 8 నెలలపాటు బఫర్‌స్టాక్ ఉందని అన్నారు. స్టాక్ ఉంటే నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండానే ఎందుకు మందులు సరఫరా చేస్తున్నారు?. లొసుగులున్నప్పుడే ఆ వ్యవస్థలో అవినీతి, అవకతవకలకు అవకాశం ఉంటుంది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తీసుకోబోతున్నారనేది పేర్కొనలేదు. ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కనిపిస్తోంది. 'క్వాలిటీ అనాలసిస్ విభాగాన్ని పునరుద్ధరిస్తాం. ల్యాబులను ఎంప్యానెల్ చేసుకోవడానికి టెండర్లు పిలిచాం. కొన్ని రోజుల్లో దీన్ని పూర్తిచేస్తాం. దీని వల్ల మందుల పరీక్ష సమయం తగ్గుతుంది. అంతర్గత నాణ్యతా రిపోర్టుల తర్వాతే జిల్లాలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌కు మందులు వెళ్తాయి. మా స్థాయిలో కూడా మరోసారి మందులను పరీక్షిస్తాం. డిసిఎ కూడా మందుల నమూనాలను పరీక్షిస్తుంది. పరీక్షా ఫలితాల ఆధారంగా కంపెనీలను, వాటి ఉత్పత్తులను బ్లాక్‌లిస్టులో పెడతాం. కంప్యూటరైజేషన్ కోసం భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం' అని వివరణలో పేర్కొన్నారు.

Saturday, March 15, 2014
నమ్మకానికి తూట్లు
- నాణ్యతలేని మందుల సరఫరా
- విజిలెన్స్ విభాగం లేకుండానే రూ.1910 కోట్ల కొనుగోళ్ల్లు
- రూ.కోట్లు ఖర్చుపెట్టినా ఫలితం శూన్యం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
'డూ నో హామ్' అని ఫ్లారెన్స్ నైటింగేల్ అన్నారు. అంటే ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని మాత్రం చేయకూడదని అర్థం. ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి దీనికి భిన్నంగాఉంది. ఎంతో నమ్మకంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రోగులకు నాణ్యతలేని మందులు ఇవ్వడం వల్ల ఎదుర్కొనే కష్టాలు చెప్పలేనివి. 35 ఏళ్ల వెంకటయ్యకు కూలీపనే జీవనాధారం. జ్వరంతో ఒక రోజు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. డాక్టర్ పరీక్షించి 5 నుంచి 7 రోజులు మందులు వాడాలని చెప్పాడు. ఆసుపత్రిలో ఇచ్చే మందులు వారం రోజులు వాడాడు. అయినా జ్వరం తగ్గలేదు. అతడప్పుడు ప్రభుత్వాసుపత్రికి వెళ్తే జబ్బు తగ్గలేదని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఇక్కడా పరీక్షలు, మందులు, డాక్టర్ ఫీజు కోసం సుమారు రూ.1000 ఖర్చయ్యింది. ఈ డబ్బుల కోసం అప్పుచేయాల్సిన పరిస్థితి. దీంతో మళ్లీ ఓ వారం రోజులు ఇంట్లో ఉండి మందులు వాడాడు. అంటే అతడు సుమారు 10 నుంచి 15 రోజుల కూలీదినాలు కోల్పోయాడు. ఇలాంటి వాళ్లు రాష్ట్రంలో ఇంకెంత మంది ఉన్నారో?. దీనికి గల కారణాలు లోతుగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు బయటపడ్డాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వేళల్లో అందుబాటులో ఉండేలా నాణ్యమైన మందులు చవక ధరలకు కొనాలనేది ప్రభుత్వ ఉద్దేశం. మందులు వ్యాధిని తగ్గించే విధంగా ఉండాలి. కొనుగోళ-్ల పారదర్శకంగా ఉండాలి. మందుల వినియోగం హేతుబద్దంగా ఉండేలా ప్రోత్సహించాలి. దీనికి సంబంధించిన జిఓ నం.1357 ను అక్టోబర్, 2009లో ప్రభుత్వం విడుదల చేసింది. 2013 డిసెంబర్ నెలలో అత్యవసర మందుల జాబితా-2013కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వు జారీ చేసింది. కొత్త కొనుగోళ్ల విధానం ప్రకారంగా ఎఎంఎల్/ఇఎంఎల్ జాబితాలోని మందులను మాత్రమే కొనాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (ఎపిఎంఎస్ఐడిసి) ఎండిని, వైద్య, ఆరోగ్య శాఖలోని ఇతర విభాగాధిపతులను కోరింది.
కొనుగోళ్లలో కొరవడిన ప్లానింగ్
509 రకాల మందులతో జాబితా రూపొందించారు. 2011లో మందుల కోసం రూ.180 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అది 2013 నాటికి రూ.330 కోట్లకు పెరిగింది. 80 శాతం అంటే రూ.264 కోట్లకుపైన మందులు ఎపిఎంఎస్ఐడిసి ద్వారా కొంటున్నారు. మిగతా 20 శాతం మందులను బోధనాసుపత్రులు, ఇతర ప్రభుత్వాసుపత్రులు కొంటున్నాయి. ఈ మందుల కొనుగోళ్ల గురించి ఎపిఎంఎస్ఐడిసి వారుకాని, విభాగాధిపతులు కాని పట్టించుకోవడం లేదని తెలిసింది. ఏడాదిలో మూడు నెలలకోసారి మందులు కొనుగోళ్లు చేస్తారు. ప్రతీసారీ గొంతుమీదికి వచ్చాకే హడావిడిగా కొనుగోళ్లు చేసి, నాణ్యతా పరీక్ష నిర్వహించకుండానే మందులను సరఫరా చేస్తున్నారు. మందుల కొనుగోళ్ల బడ్జెట్ పెరిగినప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకోకుండా ఇంకా పాత పద్ధతిలోనే వెళ్తున్నారు. ఇలా స్టాక్ పెట్టుకుంటే అన్ని మందులకు నాణ్యతా పరీక్ష నిర్వహించి సరఫరా చేసే అవకాశం ఏర్పడుతుంది. బడ్జెట్ పెరిగినా కొనుగోళ్లకు ప్లానింగ్ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్లానింగ్ లేకుండా హడావిడిగా కొనేసి డబ్బులు వృధా చేస్తున్నారు. రూ.330 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అనవసర, నాణ్యతలేని మందులు కొంటున్నారని కొంత మంది వైద్యులు విమర్శిస్తున్నారు. దీని వల్ల అటు ప్రజలకు, ఇటు వైద్యులకు ఇద్దరికీ ఉపయోగం లేకుండా పోతోంది.
నాణ్యత తగ్గినా చర్యలు శూన్యం
ఒక మందును తయారు చేసే పెద్ద కంపెనీ ఒక బ్యాచ్‌లో సుమారుగా 50 వేల మాత్రలను కంప్యూటరైజ్డ్ మెషిన్ల ద్వారా ఉత్పత్తి చేస్తుంది. పెద్ద కంపెనీల నుంచి కొనడం వల్ల పరీక్షకు పంపించే నమూనా మాత్రల సంఖ్య తగ్గుతుంది. ఈ నమూనా మందును పరీక్షిస్తే ఒకే ఫలితం వస్తుంది. కానీ కాసులకు కక్కుర్తి పడ్డ ఎపిఎంఎస్ఐడిసి ఉన్నతాధికారులు చిన్న చిన్న కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఆర్డర్ పొందడానికి అర్హత సంపాదించేందుకు చిన్న కంపెనీలు తక్కువ టర్నోవర్‌ను అర్హతగా కోరుతున్నారు. దీంతో చిన్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండానే వీటికి పెద్ద పెద్ద ఆర్డర్లు ఇస్తున్నారు. చిన్న కంపెనీలు పదివేల మాత్రలు ఉత్పత్తి చేయగానే యంత్రాలు వెడెక్కడం, ఇతర కారణాల వల్ల మందుల నాణ్యత తగ్గుతోంది. కానీ వాస్తవానికి ఈ చిన్న కంపెనీలు పెద్ద కంపెనీల్లాగే తక్కువ బ్యాచ్‌లలో అధిక మొత్తంలో మందులను సరఫరా చేస్తున్నాయి. బ్యాచ్ సామర్థ్యానికి, ఇచ్చిన ఆర్డర్‌కు మధ్య పొంతన ఉండటంలేదు. ఈ ప్రసహనంలో సుమారు 60 నుంచి 80 శాతం వరకు నాణ్యత తక్కువున్న మందులను సరఫరా చేస్తున్నా వీటిపై ఎపిఎంఎస్ఐడిసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 1998 నుంచి మందులు కొనుగోళ్లు చేస్తున్నా ఇప్పటి వరకు ఎపిఎంఎస్ఐడిసి క్వాలిటీ పాలసీని రూపొందించలేదు. తమిళనాడులో మందుల కొనుగోళ్ల విభాగంలో 60 మంది, రాజస్థాన్‌లో 120 మంది ఆయా రంగాల్లో నిపుణులైన అధికారులున్నారు. కానీ మన రాష్ట్రంలోని ఎపిఎంఎస్ఐడిసిలో కేవలం 9 మందితోనే ఈ మొత్తం పని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే రాజుగారి నూలుపోగు వస్త్రాల కథను గుర్తుకు తెస్తోంది. ఈ 15 ఏళ్లలో ఎపిఎంఎస్ఐడిసి ద్వారా రూ.1910 కోట్ల రూపాయల మందులను కొనుగోళ్లు జరిగాయని అంచనా. అయినా ఇందులో అంతర్గత విజిలెన్స్ శాఖను ఏర్పాటు చేయలేదు. ఇన్ని కోట్ల రూపాయల కొనుగోళ్లు చేస్తున్నా రాష్ట్ర విజిలెన్స్ శాఖ దీనిపై నామమాత్రమైనా నిఘా పెట్టలేదు.
ప్రజారోగ్యంపై నాణ్యతలేమి ప్రభావం
20 వేల మందుల బ్యాచ్‌లలో 200 మందుల బ్యాచ్‌లలో నాణ్యత లేదని నిర్ధారణ అయ్యాయని అనుకుందాం. ఒక బ్యాచ్‌లో కనీసం 20 వేల మందులున్నాయనుకుంటే మొత్తం 40 లక్షల నాణ్యత లేని మందులు పేద రోగులకు అందించినట్లే. ఒక రోగికి పది మందుల స్ట్రిప్ అందజేస్తే 4 లక్షల మంది రోగులను మోసం చేసినట్లే. ఫలితంగా జబ్బు తగ్గక, ప్రైవేటు వైద్యం చేయించుకోవడం వల్ల ప్రజలు రూ.40 కోట్లు నష్టపోతున్నారు. మందుల కొనుగోళ్లకు పెట్టిన రూ.330 కోట్ల బడ్జెట్లో 80 శాతం అంటే రూ.260 కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది. ఏది ఏమైనా ఇన్ని కోట్లు ఖర్చుపెట్టినా ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఎపిఎంఎస్ఐడిసి తన లోపాలను సరిదిద్దుకుని, నాణ్యమైన మందులు సరఫరా చేసి కోల్పోయిన నమ్మకాని తిరిగి పొందుతుందేమో వేచి చూడాలి.

Friday, March 14, 2014
అమ్మో 31వ తారీఖు !
- కాంట్రాక్టు పారామెడికల్, ఎఎన్ఎం గుండెల్లో గుబులు
- ప్రతిపాదనలు పంపని శాఖాదిపతులు
- స్థంభించనున్న వైద్యసేవలు?
- కొనసాగించకుంటే కలెక్టరేట్ల వద్ద ఆందోళన
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ప్రతీ నెలా చివరి రోజు అంటే అందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే తర్వాత రోజు జీతాలు వస్తాయని. కానీ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు పారామెడికల్, ఎఎన్ఎంలు, సెకండ్ ఎఎన్ఎం, యూరోపియన్ ఎఎన్ఎం, ఔట్సోర్సింగ్ సిబ్బందిలో మాత్రం ఈ నెల 31వ తారీఖు అంటే గుండెల్లో గుబులు కలుగుతోంది. కారణం వీరి కాంట్రాక్టు ఆ రోజుతో ముగుస్తుంది కాబట్టి. ఆ తర్వాత రోజు నుంచి విధుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. మరోవైపు ప్రభుత్వానికి శాఖాధిపతుల నుంచి ప్రతిపాదనలు వెళ్లలేదు. ప్రభుత్వం కూడా వీరిని కొనసాగింపు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇంకా వెళ్లని ప్రతిపాదనలు
వైద్య ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో 7 వేల మంది కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. మార్చి 31వ తేదితో కాంట్రాక్టు ముగుస్తున్నా వీరిని కొనసాగించే విషయమై ఇప్పటికీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లలేదు. ప్రతిపాదనలు వెళ్తే దీనిపై ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుని, మళ్లీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు పంపిస్తారు. ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు కింది స్థాయి వరకు పంపాల్సి ఉంటుంది. ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఈ పని సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 'కాంట్రాక్టు పారామెడికల్, ఔట్సోర్సింగ్ సిబ్బంది కొనసాగింపు గురించి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రభుత్వానికి ఇంకా ప్రతిపాదనలు పంపలేదు. పంపిస్తాం' అని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ ఎస్.అరుణకుమారి తెలిపారు.
కొనసాగించకూడదని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ (ఎపివివిపి) లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం సుమారు 5 వేల మంది ఉన్నారు. మార్చి 31వ తేది వరకే వీరిని కొనసాగించాలని, ఆ తర్వాత కొనసాగించకూడదని ఇప్పటికే ఎపివివిపి కమిషనర్ కనకదుర్గమ్మ ఆదేశాలిచ్చారు. వీరి కొనసాగింపు గురించి ప్రభుత్వానికి లేఖ రాశామని తగిన ఉత్తర్వులు రాలేదని సమాచారం. 31వ తేది తర్వాత వీరిని కొనసాగిస్తే మేం జీతాలివ్వలేమని, అందుకే కొనసాగించడం లేదని తెలిసింది.
బెదిరిస్తున్న జిల్లా అధికారులు
కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలో సుమారు 16 వేల మంది కాంట్రాక్టు ఎఎన్ఎంలు, సెకండ్ ఎఎన్ఎంలు, యూరోపియన్ ఎఎన్ఎంలు పనిచేస్తున్నారు. ఇప్పటికే వీరికి ఆరు నెలల నుంచి జీతాలు లేవు. వీరిని కొనసాగించే విషయంపై సందిగ్ధం నెలకొన్నది. తొలగించాలని ఆదేశాలు రాకున్నప్పటికీ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తారని జిల్లా అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శాఖలో రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్ల విభజన పని జరుగుతోంది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపుపై ఇంకా దృష్టిపెట్టలేదు.
కలెక్టరేట్ వద్ద ఆందోళన
ఎఎన్ఎం, స్టాఫ్‌నర్స్, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, ఆఫ్తాల్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిఓ నం.39ని జారీ చేసింది. ఈ పోస్టుల్లో ఇప్పటికే 12 ఏళ్ల నుంచి కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం మోసం చేసింది. రాతపరీక్ష నిర్వహించడం, సర్వీసు వెయిటేజి ఇస్తామని ప్రభుత్వం ఆశచూపినా దీన్ని సిబ్బంది అంగీకరించడం లేదు. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు పారామెడికల్, ఎఎన్ఎం, సెకండ్ ఎఎన్ఎం, యూరోపియన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి ఇప్పటికే కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్యవిధానపరిషత్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు రెండు రాష్ట్రాల యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. మార్చి 31వ తేదితో పూర్తవుతున్న కాంట్రాక్టు కొనసాగించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదానాయక్, బలరాం, ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, పలివెల శ్రీనివాసులు తెలిపారు. కొనసాగించకుండా చర్యలు తీసుకోని పక్షంలో రెండు రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. వీరిని కొనసాగించకుంటే వైద్య, ఆరోగ్యశాఖ, ఆసుపత్రుల్లో సేవలు స్థంబించే అవకాశముంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోంది. పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. గవర్నర్ పరిపాలన వ్యవహారాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్, ఎఎన్ఎం, సెకండ్ ఎఎన్ఎం, యూరోపియన్ ఎఎన్ఎం, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాంట్రాక్టు కొనసాగింపు ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Tuesday, March 11, 2014
ఆడిందే ఆట పాడిందే పాట
-అక్రమంగా కోట్లు దండుకుంటున్న ఇఎంఆర్ఐ
-పనిచేయని ట్రాకింగ్ వ్యవస్థ అ రూ.2 కోట్లు వృధా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో ప్రభుత్వ ధనంతో 108 అంబులెన్సులను నిర్వహిస్తున్న ఇఎంఆర్ఐ (ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వ్యవహరిస్తున్న తీరు ఆడిందే ఆట పాడిందే పాటలా ఉంది. రోజూ ఎన్ని అంబులెన్సులు తిరుగుతాయో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ట్రాకింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. దీని గురించి ప్రభుత్వం ఇఎంఆర్ఐకి తెలిపినా పట్టించుకోలేదు. తిరగని వాహనాలకూ అక్రమంగా కోట్లాది రూపాయలు దండుకుంటోంది.
కొంత కాలం క్రితం 108 నంబరుకు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లోపు అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడది గంట నుంచి గంటనర్న తర్వాత వస్తోంది. దీనికి కారణం సిబ్బంది తక్కువగా ఉండటమే కాక వాహనాలు బ్రేక్‌డౌన్ అవడం కూడా. ఇంతకు ముందు అంబులెన్సులు తిరిగే పరిధి 25 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఈ పరిధిలోనే క్షతగాత్రులు, రోగులను తీసుకెళ్లేది. ఇప్పుడు పరిధిలేకుండా తిరుగుతున్నాయి. దీంతో ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ రావడానికి గంటకుపైగా సమయం పడుతోంది. ఆలస్యమవడంతో క్షతగాత్రులను అందుబాటులో ఉన్న వాహనాల్లో ఆసుపత్రికి తరలిస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరుగుతున్నాయి. డ్రాపౌట్ కేసుల సంఖ్య 45కు చేరుకున్నది.
తిరగని అంబులెన్సుకూ డబ్బులు
కర్నూలు జిల్లాలో 32 అంబులెన్సులున్నాయి. గత నెలలో 180 షిఫ్టులు బ్రేక్‌డౌన్ అయ్యాయి. అంటే ఎక్కడా తిరగలేదు. విశాఖపట్నంలో మొత్తం వాహనాల సంఖ్య 39, బ్రేక్‌డౌన్ 170 షిఫ్టులు, చిత్తూరు జిల్లాలో 41 వాహనాలకు, 150 షిఫ్టులు బ్రేక్‌డౌన్ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 36 అంబులెన్సులున్నాయి. ఇక్కడ ఉండాల్సి సిబ్బంది 220 మంది. కానీ 185 మంది మాత్రమే ఉన్నారు. వీరితోనే అంబులెన్సులు నడుస్తున్నాయి. దీంతో నెలలో ఈ జిల్లాలో 150 షిఫ్టులు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. ఒక అంబులెన్స్ నెలలో 60 షిఫ్టులు తిరుగుతుంది. అంటే ఈ జిల్లాలో నెలకు నాలుగు అంబులెన్సులు తిరగడంలేదు. ప్రభుత్వం ఇఎంఆర్ఐకి ఒక్కో అంబులెన్సుకు రూ.1,12,000 చెల్లిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో తిరగని నాలుగు వాహనాలకు కూడా నెలకు రూ.4,48,000 అక్రమంగా డబ్బులు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నెలకు 72 వాహనాలు బ్రేక్‌డౌన్ అవుతున్నాయని అంచనా. అంటే నెలకు రూ.1,03,04,000 అక్రమంగా ప్రజాధనాన్ని ప్రభుత్వం నుండి దండుకుంటున్నది.
పనిచేయని ట్రాకింగ్ వ్యవస్థ
ఇఎంఆర్ఐ మాత్రం ప్రతీ నెలా మొత్తం అంబులెన్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వానికి చెబుతోంది. బ్రౌక్డౌన్ అయిన వాటి గురించి వివరాలు చెప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో అంబులెన్సుల బ్రేక్‌డౌన్ గురించి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని 108 సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.రాజ్‌కుమార్ తెలిపారు. అంబులెన్సులను ట్రాకింగ్ చేస్తే ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో లెక్క తెలుస్తుందని ప్రభుత్వం భావించింది. దీని కోసం ఆటోమెటిక్ వెహికల్ లొకేటర్ ట్రాన్స్‌మీటర్ (ఎవిఎల్టి)ని అంబులెన్సుల్లో అమర్చాలని నిర్ణయించింది. కొనుగోళ్ల కమిటీ భారతీ ఎయిర్టెల్ బిడ్‌ను 2012, జూన్‌లో ఎంపిక చేసింది. అన్ని పన్నులు కలుపుకుని పరికరాలు, వార్షిక నిర్వహణతో సహా ఒక్కో యూనిట్‌కు రూ.22,327 ఖర్చవుతుందని పేర్కొన్నది. మొత్తం 802 వాహనాలకు వీటిని అమర్చాలని ఇఎంఆర్ఐని ప్రభుత్వం కోరింది. సెప్టెంబరులో కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. 802 అంబులెన్సుల్లో 550 అంబులెన్సుల్లోనే ఎవిఎల్టిని అమర్చామని ఇఎంఆర్ఐ ప్రభుత్వానికి తెలిపింది. కానీ టెండరు నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా వీటిని అమర్చడం పూర్తవ్వాలి. ఏడాది అవుతున్నా మిగిలిన వాహనాల్లో వీటిని అమర్చలేదు. అంబులెన్సుల్లో చైనా టాబ్లెట్ పిసిలను అమర్చారు. వీటి ఖరీదు రూ.3000 మాత్రమే ఉంటుంది. ఇవీ అసలు పనిచేయడం లేదు. దీంతో రెండు కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. కొత్త ఎంఓయు ప్రకారం అంబులెన్సుల ట్రాకింగ్ చేసే వ్యవస్థను (మానిటర్, ఇతర పరికరాలు, హార్డ్‌వేర్,సాఫ్ట్వేర్) కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ఏర్పాటు చేయాలి. దీంతో ఏ వాహనం ఎంత దూరం? ఎక్కడెక్క తిరిగింది? ప్రభుత్వాసుపత్రికి వెళ్లిందా? ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిందా? బ్రేక్‌డౌన్ అయ్యిందా? అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు కమిషనరేట్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇఎంఆర్ఐ పెడచెవిన పెట్టింది. 108 వాహనాల నిర్వహణలో ఇన్ని లోపాలున్నా ప్రభుత్వం మాత్రం మొత్తం బడ్జెట్‌ను విడుదల చేస్తోంది. విడుదల చేయకుంటే సిఎం కార్యాలయం నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారనే విమర్శలున్నాయి. 108 వాహనాలను నిర్వహిస్తున్న ఇఎంఆర్ఐపై ఆడిట్ నిర్వహిస్తే నిజాలు నిగ్గుతేలుతాయి.
Monday, March 10, 2014
Saturday, March 8, 2014
దిగజారుతున్న నిమ్స్ ప్రతిష్ట
- వారం నుంచి మూతబడ్డ క్యాథ్‌ల్యాబ్
- డయాలసిస్‌కు కరువైన ట్యూబులు
- కంటతడిపెడుతున్న రోగులు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రోజు రోజుకు నిమ్స్ ప్రతిష్ట దిగజారుతోంది. వారం నుంచి క్యాథ్‌ల్యాబ్ మిషన్ చెడిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కిడ్నీలు చెడిపోయి డయాలసిస్‌తో బతికే రోగులు నరకం చూస్తున్నారు. డయాలసిస్‌కు ట్యూబులు లేక గంటలతరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందు నిమ్స్‌కు వినాశనానికి కారణమైన ఆ నలుగురు పరిపాలనాధికారులు ఇప్పుడూ అదే పనిలో నిమగమయ్యారు. ఇంత జరుగుతున్న నిమ్స్ డైరెక్టర్ తమాషా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నిమ్స్‌కు వచ్చే అత్యధిక ఆదాయానికి కారణమైన కార్డియాలజి విభాగం క్యాథ్‌ల్యాబ్ మూతపడి వారం రోజులవుతోంది. మూడు క్యాథ్‌లాబ్‌లు ఉన్నప్పుడు కార్డియాలజి విభాగానికి రోజుకు 50 మంది మాత్రమే వచ్చేవారు. ఈ విభాగంలో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు రోజుకు 200 మంది రోగులు వస్తున్నారు. ఇందులో 25 మంది అడ్మిట్ అవుతారు. వీరందరికి క్యాథ్‌ల్యాబ్‌లో యాంజియోగ్రాం చేయాల్సి ఉంటుంది. రేడియోలజి విభాగం వారిని బతిమలాడి యాంజియోగ్రాం చేస్తున్నారు. శుక్రవారం యాంజియోగ్రాం జరగలేదు. శనివారం 10 మాత్రమే జరిగాయి. మళ్లీ సోమవారం కూడా 10, 15 మాత్రమే జరుగుతాయి. మిషన్ చెడిపోయి రోగులు యాంజియోగ్రాం, యాంజియోప్లాస్టీ కోసం రెండు, మూడు రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. విధిలేని పరిస్థితుల్లో కార్డియాలజి విభాగం డాక్టర్లు ఓపి చూసి రోగులను పంపిస్తున్నారు. ఏడేళ్ల నుంచి కొత్తవి ఎందుకు కొనలేదు?. ఇప్పుడు చెడిపోయిన క్యాథ్‌ల్యాబ్ మిషన్లను గతంలో బ్యాంకు రుణం ద్వారా తీసుకున్నవే. రుణం ఇవ్వడానికి ఆంధ్రబ్యాంకు ముందుకు వస్తున్నా నిమ్స్ మాత్రం సిద్ధంగా లేదు. నిమ్స్ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆసుపత్రి అభివృద్ధికి ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. కొత్త క్యాత్లాబ్మిషన్లు కొనవద్దని గతంలో ఏ ముఖ్యమంత్రైనా అడ్డుపడ్డారా? ఇప్పుడు ఎవరు అడ్డుతగులుతున్నారు? ఆసుపత్రి అభివృద్ధికి ఎవరు అడ్డుపడుతున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడేళ్ల నుంచి కాగితాలమీదనే కొనగోళ్లు జరుగుతున్నాయి. పరికరాలు కొనుగోళ్లకు నిపుణుల కమిటీ ఉన్నది. మూడు రోజులు సమావేశమైతే కొత్తవి కొనొచ్చు. నిపుణుల కమిటీ అడ్డుపడుతుందా? అభివృద్ది నిరోధక కారకులు ఎవరు? నిమ్స్ అధికారులు ఒక సారి ఆత్మపరిశీలిన చేసుకోవాల్సిన అవసరముంది. డైరెక్టరు అవినీతిపరుడు కాకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా, చేతులు కట్టుకుని కూర్చోవడం, ఇంత జరుగుతుంటే తమాషాలా చూడటం కూడా తప్పుకింద లెక్క అని ఒక వైద్యుడు వ్యాఖ్యానించాడు.
'డబ్బులు చెల్లించినా నరకం చూస్తున్నాం'
నిమ్స్‌లోని డయాలసిస్ కేంద్రంలో రోజూ 175 డయాలసిస్‌లు జరుగుతాయి. గత కొంత కాలంగా డయాలసిస్ కోసం అవసరమయ్యే డైలేజర్ ట్యూబుల కొరత ఉంది. వీటిని కొనడం లేదు. డబ్బులివ్వకపోవడం సరఫరా ఆగింది. గురువారం డైలేజర్ ట్యూబులు లేక రెండు మూడు గంటలు డయాలసిస్ ఆగిపోయింది. శుక్రవారం 100 ట్యూబులిచ్చారు. అవి ఆ రాత్రికే అయిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు డయాలసిస్ మొదలు కాలేదు. శనివారం మధ్యాహ్నం 150 ట్యూబులు వచ్చాయి. శనివారం రాత్రికి ఇవి అయిపోతాయి. శనివారం రాత్రి నుంచి సోమవారం ట్యూబులు వచ్చే వరకు డయాలసిస్ ఆగుతుంది. కొసిరి కొసిరి మరీ 100, 150 ఇస్తున్నారు. చేసేదేమి లేక కొంత మంది బయటికి వెళ్లి రూ.2500లకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. 'ఇంత నరకం ఎక్కడ చూడలేదు. పైసలు తీసుకుని కూడా డయాలసిస్ చేస్తలేరు. డయాలసిస్ ఆలస్యమైతే ఆరోగ్యం సమతుల్యత దెబ్బతినే అవకాశముంది. ఇది రోగిహక్కును హరించడమే. డబ్బులు చెల్లించినా నరకం చూస్తున్నాం. డాక్టర్ల కోసమే ఇక్కడి వస్తున్నాం ' అని ఒక రోగి ఆవేదన వ్యక్తం చేశారు. 'నాకీ మాయరోగం వచ్చించి. చచ్చిపోయినా బాగుండేది. కిడ్నీ జబ్బు వచ్చింది. ఏడాదిన్నర నుంచి డయాలసిస్ చేసుకుంటున్నాను. ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. రెండతస్తులు ఎక్కి ఉదయం 8 గంటలకు వస్తే ట్యూబులు లేవని అంటున్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లల కోసం బతుకుతున్నాను. ఏసి గదుల్లోని కూర్చునే అధికారులకు మా ఇబ్బందులు ఏం తెలుస్తాయి. ' అని కంటతడిపెట్టారు డయాలసిస్ చేసుకునే ఒక మహిళ.
మళ్లీ ఆ నలుగురే.....
నిమ్స్‌లో ఏ చిన్న ఫైలు కూడా కదలడం లేదు. ఏ ఫైలు కూడా డైరెక్టర్ చూడటం లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఒక్క వస్తువు కూడా కొనడం లేదు. పేషెంట్ డిశ్చార్జి సమ్మరికి అవసరమయ్యే పేపర్‌కూ కరువొచ్చింది. డాక్టర్లే పేపర్లు కొనుకొచ్చి సమ్మరి ప్రింట్ ఇస్తున్న పరిస్థితి నెలకొన్నది. డైరెక్టర్ ఎంతసేపు డబ్బులు పొదుపు చేయాలంటారు. నిమ్స్‌కు డబ్బులొచ్చే క్యాథ్‌ల్యాబ్, డయాలసిస్‌ను పట్టించుకోకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దాతలు విరాళాలు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఏం ప్రజాసేవ చేశారని విరాళాలు ఇవ్వాలనేవాళ్లూ లేకపోలేదు. ఇన్నేళ్లుగా నిమ్స్‌లో ఉచితంగా వైద్యం చేయలేదు. ప్రతీ దానికి నిర్ణీత ఫీజు వసూలు చేశారు. ఇక్కడున్న రెసిడెంట్ డాక్టర్లు కూడా బతుకు జీవుడా అని బయటికి వెళ్లి ప్రాక్టీసు చేసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. 2004 నుంచి 2013 ఆగస్టు వరకు ఉన్న డైరెక్టర్లు ఏ నలుగురిని చేరదీసి నిమ్స్‌ను నాశనం చేశారో, ఆ నలుగురినీ ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ చేరదీస్తున్నారు. నిమ్స్ వినాశనానికి ప్రత్యక్షంగా కారణం అవుతున్నారు. ఈ నలుగురు ఉదయం నుంచి ఆయన చుట్టే ఉంటారు. వీరంత ఒక కోటరిగా ఏర్పడి డైరెక్టర్ దగ్గరికి ఎవర్నీ రానివ్వరు. సమస్యను చెప్పనివ్వరు. ఒక్క ఫైలునూ కదలనివ్వరు. ప్రతీ కమిటీలో వీళ్లే ఉంటారు. ఆ కమిటీని ముందుకు వెళ్లనివ్వరు. డైరెక్టర్ నుంచి వచ్చిన ఫైళ్లలో డబ్బులొచ్చే ఫైళ్లను మాత్రం చూసి మిగతావి పక్కన పడేస్తున్నారు. నిమ్స్‌లో వీళ్లే చక్రం తిప్పుతుంటారు. తన నుంచి వెళ్లిన ఫైలు ఏమైందని కూడా అడగడానికి కూడా డైరెక్టర్ ఆసక్తి చూపడం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. గవర్నర్ పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొరడా ఝలిపిస్తున్నారు. నిమ్స్‌పై గవర్నర్ దృష్టిపెట్టి, చర్యలు తీసుకుని, లోపాలను సరిచేస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది.

Thursday, March 6, 2014
Monday, March 3, 2014
ఆదాయం ఉన్నా..అభివృద్ధి సున్నా
ఇది నిమ్స్ కార్డియాలజీ విభాగం దుస్థితి
-ఒక్క క్యాథ్‌ల్యాబ్‌తో నెట్టుకొస్తున్న వైనం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
నాణ్యమైన, నమ్మకమైన వైద్యానికి పెట్టింది పేరు హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్). నిమ్స్ చుట్టుపక్కల ఐదారు పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులున్నా చాలా మంది నిమ్స్‌కు రావడానికి ముఖ్య కారణం ఇక్కడ పనిచేసే డాక్టర్లపై నమ్మకం ఉండటమే. అన్ని విభాగాల్లోకెల్లా నిమ్స్‌కు సమకూరే ఆదాయంలో 40 నుంచి 50 శాతం కేవలం కార్డియాలజి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల నుంచే వస్తోంది. అయినా పదేళ్లుగా కార్డియాలజి విభాగం అభివృద్ధికి నోచుకోవడం లేదు.
కార్డియాలజి విభాగంలో ఇంతకు ముందు మూడు క్యాథ్‌లాబ్‌లు ఉండేవి. సర్వీసు పూర్తవడంతో రెండింటిని మూసేశారు. నిమ్స్‌లో ప్రస్తుతం ఒక్క క్యాథ్‌ల్యాబ్ ఉన్నప్పటికీ మంచి వైద్యం చేస్తారనే ఆశతో చాలా మంది ఇక్కడికే వస్తున్నారు. పని భారం ఎక్కువైనా, రోగుల తాకిడి ఉన్నప్పటికీ కార్డియాలజి విభాగం వైద్యులు ఆలస్యమైనా ఆ రోజు వచ్చిన కేసులను ఆ రోజే పూర్తి చేస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు పనిచేసిన రోజులున్నాయి. ఇందుకు వీరిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. గుండె సంబంధ సమస్యలను గుర్తించడంలో క్యాథ్‌ల్యాబ్ కీలకమైంది. ఇందులో యాంజియోగ్రం చేస్తారు. తర్వాత గుండె జబ్బు తీవ్రతను బట్టి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ యాంజియోప్లాస్టీ చేస్తారు. యాంజియోగ్రాం, యాంజియోప్లాస్టీ చేయించుకునే రోగులు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. తమ వంతు వచ్చే వరకు ఎదురుచూస్తూనే ఉండాలి. ఒకటే క్యాథ్‌ల్యాబ్ ఉండటం వల్ల కొన్ని సార్లు రోగులు ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి. క్యాథ్‌ల్యాబ్‌లో యాంజియోగ్రాం, యాంజియోప్లాస్టీ జరుగుతున్న సందర్భంలో అత్యవసరంగా గుండెపోటు కేసులు వస్తుంటాయి. దీంతో చేస్తున్న కేసును పక్కనపెట్టి అత్యవసర కేసుకు ప్రాధాన్యత ఇచ్చి యాంజియోగ్రాం నిర్వహించాల్సిందే.
నిర్లక్ష్యానికి నిలువుటద్దం
ఆదాయం విషయంలో కార్డియాలజి విభాగం ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటోంది. సాధారణంగా కార్పొరేట్ వైద్యరంగంలో ఒక విభాగం నుంచి అత్యధిక ఆదాయం వస్తుంటే ఆ విభాగం అభివృద్ధికి, మౌలిక వసతులు, సదుపాయాలపై ప్రత్యేక దృష్టిపెడతారు. విస్తరణ చేపడతారు. కానీ నిమ్స్‌లో మాత్రం గత 10 ఏళ్లుగా కార్డియాలజి విభాగం మాత్రం నిర్లక్ష్యానికి గురైందని చెప్పాలి. ఈ కాలంలో పనిచేసిన డైరెక్టర్లు ఎవరూ దీని అభివృద్ధికి చొరవ తీసుకోలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నిష్ణాతులైన వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఒక్క క్యాథ్ల్యాబ్తోనే నెట్టుకొస్తున్నారు. క్యాథ్ల్యాబ్లా ఏర్పాటు గురించి ఈ విభాగం నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. కానీ కార్యచరణ కొరవడింది. ఒక క్యాథ్‌ల్యాబ్ కోసం సుమారు రూ.4.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌కు 2013-14 ఆర్థిక సంవత్సరంలో నాలుగు దఫాలుగా రూ.64 కోట్ల ను విడుదల చేసింది. అదనంగా మరో రూ.20.50 కోట్లు ఇచ్చింది. రూ.10 కోట్లు ఖర్చు చేస్తే రెండు కొత్త క్యాథ్‌ల్యాబ్‌లను ప్రారంభించొచ్చు. దీని వల్ల రోగుల సంఖ్య పెరుగుతుంది. వైద్యులు కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. క్యాథ్‌ల్యాబ్‌కు అవసరమయ్యే స్టెంట్లు, క్యాథటర్లు, ఇతర పరికరాలు కొనుగోలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని సమాచారం. ముందుగానే ఇండెంట్ పెట్టినా కూడా అవసరాన్ని బట్టి వెంటనే సరఫరా చేయడంలో స్టోర్స్ విభాగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు ఏకంగా స్పెషాలిటీ బ్లాకులను ప్రారంభిస్తున్నారు. ఇందులో గుండె సంబంధ కార్డియాక్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి వచ్చే కేసుల్లో గుండెకు సంబంధించినవే ఎక్కువుంటాయి. సరైన ప్రణాళికతో, ముందుచూపుతో ఆలోచిస్తే ఇప్పటికే నిమ్స్ క్యాంపస్‌లో ప్రత్యేక కార్డియాక్ బ్లాక్ ఏర్పాటై, కనీసం నాలుగు యూనిట్లు పనిచేసేవి. కానీ విభాగాలను అభివృద్ధి చేయడంలో ఇటు నిమ్స్‌కు, అటు ప్రభుత్వానికి శ్రద్ధ లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇలాంటి రకమైన విధానాలు అవలంబిస్తే నిమ్స్ ఇక ఎప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడలేదు.
ఆ కారణంతోనే...?
ఒక విభాగం అభివృద్ధి అయి, మెరుగైన వైద్య సేవలందిస్తే ఆ గుర్తింపు డైరెక్టర్‌కు, నిమ్స్కే వస్తాయి. కార్డియాలజి విభాగాన్ని అభివృద్ధి చేస్తే ఆ విభాగాధిపతికి పేరొస్తుందని, ఉన్నత స్థాయికి ఎదుగుతారనే అర్థంలేని కారణాలతో కార్డియాలజి విభాగాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఇలా వ్యక్తిగత బేషజాలకు పోవడం వల్ల చివరకు నష్టపోయేది రోగులు. ఆ తర్వాత నిమ్స్ ప్రతిష్ట క్రమంగా క్షీణిస్తుంది. నిమ్స్‌కు కొంత కాలం అప్పటి ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత కార్డియాలజి విభాగానికే చెందిన ధర్మరక్షక్ డైరెక్టర్‌గా పనిచేశారు. కానీ కార్డియాలజి విభాగంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం నిమ్స్‌కు డైరెక్టర్‌గా డాక్టర్ నరేంధ్రనాథ్ బాధ్యతలు చేపట్టి ఆర్నెళ్లవుతోంది. ఈ సారైనా క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారో? లేదో? వేచి చూడాలి.

Sunday, March 2, 2014
వెట్టి చాకిరిలో ఆరోగ్యమిత్రలు
-ఏడేళ్లుగా అరకొర వేతనం
-హెల్త్‌కార్డుల భారం వీరిపైనే
-రెండునెల్లకోసారి బదిలీ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ప్రభుత్వ కార్యక్రమం విజయంలో కింది స్థాయి ఉద్యోగులదే కీలక పాత్ర. అలాగే ఆరోగ్యశ్రీ పథకం సక్సెస్‌కు ముఖ్య కారణం ఆరోగ్యమిత్రలు. 24 గంటలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న వీరిని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఏడేళ్లుగా అరకొర జీతంతో పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదు. గతేడాది ఆర్థిక ఇబ్బందులతో రంగారెడ్డి జిల్లాలో ఒక ఆరోగ్యమిత్ర ఆత్మహత్యచేసుకున్నాడు. అందరికీ వైద్యం చేయించే వీరికి మాత్రం ఎలాంటి ఆరోగ్య బీమా లేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీలో పథకంలో 4800 మంది ఆరోగ్య మిత్రలు, 450 మంది టీం లీడర్లున్నారు. ఆరోగ్యమిత్రలు రెండు రకాలు - పిహెచ్సి ఆరోగ్య మిత్ర. నెట్వర్క్ ఆరోగ్య మిత్ర. పిహెచ్సి ఆరోగ్య మిత్ర పాథ్రమిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, గ్రీవెన్స్ సెల్ ద్వారా అనారోగ్యంతో ఉన్నవారిని గురించి చికిత్స కోసం నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. వీరికి 2008 నుంచి 2011 వరకు రూ.1000 ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్స్ ప్రభుత్వం ఇచ్చేది. మూడేళ్ల నుంచి దీన్ని నిలిపేశారు. ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి డిశ్చార్జి అయ్యే వరకు రోగుల బాగోగులను పట్టించుకునే బాధ్యత నెట్వర్క్ ఆరోగ్య మిత్రదే. టీం లీడర్లు ఆరోగ్యమిత్రల పనితీరును పర్యవేక్షించడమే కాక ఫీల్డ్‌వర్క్ చేయాలి. తమకు వచ్చే రూ.9940 వేతనంలో రూ.3 వేలు ప్రయాణ ఖర్చులకే సరిపోతున్నాయని ఒక టీం లీడర్ చెప్పారు. ఆరోగ్య మిత్రల్లో చాలా మంది డిగ్రీ పూర్తి చేసినవారే ఉన్నారు. కూలీపని చేసేవాళ్లు కూడా నెలకు రూ.7 వేలు సంపాదిస్తున్నారు. పిహెచ్సి ఆరోగ్య మిత్రకు నెలకు రూ.4600 ఇస్తున్నారు. నెట్వర్క్ ఆరోగ్య మిత్రకు రూ.7200 ఇస్తున్నారు. చాలీ చాలని జీతం ఉన్నా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని రావాలి. తళతళ మెరిసే అప్రాన్ వేసుకోవాల్సిందే. ఆరోగ్యమిత్రల్లో 34 ఏళ్లు దాటిన వాళ్లు కూడా ఉన్నారు. ఇటు వేతనాలు పెరగక, అటు ఉద్యోగం మానలేక సతమతమవుతున్నారు. రోగులకు ఇంత సేవచేస్తున్న తమకు మాత్రం ఎలాంటి ఆరోగ్య బీమా లేదని ఒక మిత్ర తెలిపారు. వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచాలన్నారు.
ఎక్కడా లేని విచిత్ర విధానం
ప్రపంచంలో ఎక్కడాలేని ఒక విచిత్రమైన విధానాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు అమలు చేస్తోంది. రెండు నెలలకోసారి ఆరోగ్యమిత్రలను ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి బదిలీచేస్తారు. దీన్ని 'షఫ్లింగ్' అని పిలుస్తున్నారు. ఇక జిల్లాల్లో అయితే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తున్నారు. పిల్ల్లల చదువులు పాడవుతాయని, ఫ్యామిలీ మార్చకుండా అవస్థలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. నెట్వర్క్ ఆసుపత్రి పట్ల ఆశ్రితపక్షపాతం వహించకుండా ఈ పద్థతిని పెట్టామని ఆరోగ్యశ్రీ ట్రస్టు హెచ్ఆర్పాలసీలో చెప్పింది. దీర్ఘకాలంగా ఒకే స్థానంలో ఉండటం వల్ల అవినీతి, అనైతిక ప్రవర్తనను నివారించడానికి దీన్ని పెట్టామన్నది. ఈ పద్ధతి కేవలం నెట్వర్క్ మిత్ర, నెట్వర్క్ లీడర్, డివిజన్ లీడర్లకు మాత్రమే వరిస్తుందని చెప్పింది. 'తల్లిదండ్రులు, అన్నదమ్ములు కూడా చేయలేని సహాయం ఆరోగ్య మిత్రలు చేస్తున్నారు. రోగులతో వ్యవహరించే తీరు, వివరించే పద్ధతి బాగుంది' అని ఒక రోగి చెప్పారు. సమస్యల గురించి ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కు కలిశామని, సమస్యలను పరిష్కరిస్తారనకుంటే చూద్దాం, చేద్దాం అని కబర్లు చెప్పారని ఆరోగ్య మిత్రలు తెలిపారు.
పిఎఫ్ సొమ్ము బొక్కిన థర్డ్‌పార్టీ
ఆరోగ్య మిత్రలకు హెచ్ఎల్సిఎస్ థర్డ్‌పార్టీగా వ్యవహరిస్తోంది. వీరికిచ్చే వేతనం నుంచి నెలకు రూ.480 పిఎఫ్ కోసం కట్ చేస్తారు. రెండేళ్ల నుంచి సుమారు 20 లక్షల రూపాయలు మిత్రల జీతం నుంచి కట్ చేశారు. ఇప్పటి వరకు ఈ డబ్బును పిఎఫ్ ఖాతాలో వేయకుండా హెచ్ఎల్సిఎస్ దాచుకున్నదని ఆరోగ్య మిత్రలు ఆరోపిస్తున్నారు. ఇఎస్ఐ కోసమని నెలకు రూ.80 రూపాయలు కట్‌చేస్తున్నా ఇఎస్ఐ కార్డు ఇవ్వలేదు. మిత్రలకు ఏడాదికి 15 సెలవులు మాత్రమే ఉంటాయని ఆరోగ్యశ్రీ ట్రస్టు తన హెచ్ఆర్ పాలసీలో స్పష్టంగా పేర్కొన్నది. ప్రతీ సంవత్సరం థర్డ్‌పార్టీ (ఔట్సోర్సింగ్)కు ఇవ్వడం వల్ల తాము అనుభవాన్ని కోల్పోతున్నామని ఆరోగ్యమిత్రలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏజెన్సీ మారినప్పుడల్లా ఇఎస్ఐ, పిఎఫ్ నంబర్లు మారిపోతున్నాయన్నారు.
ప్రసవానికి వేతనంలేని సెలవు
ఆరోగ్యమిత్రల్లో 60 శాతానికి పైగా మహిళలున్నారు. మహిళా ఆరోగ్య మిత్రలకు వేతనం లేని మూడు నెలల ప్రసవ సెలవిస్తున్నారు. పండగ రోజు కూడా కుటుంబ సభ్యులను వదిలి డ్యూటీ చేయాల్సి వస్తోందని ఒక మహిళా ఆరోగ్య మిత్ర చెప్పారు. షఫ్లింగ్ పద్దతి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోందన్నారు. పెరిగిన ధరలు తట్టుకోలేక, వచ్చే రూ.7200 వేతనంతో పిల్లల్ని చదివిస్తూ, కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, బతుకుభారమైనా తప్పనిసరిగా ఉద్యోగం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యమిత్రలపై హెల్త్‌కార్డుల భారం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ హెల్త్‌స్కీం (ఇహెచ్ఎస్) ఆరోగ్య మిత్రలకు భారంగా మారనున్నది. 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 6 లక్షల మంది పెన్షనర్లు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చే ఇహెచ్ఎస్ స్కీము లబ్దిదారుల బాధ్యతను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆరోగ్యమిత్రలపై నెట్టేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3వేల మంది హెల్త్‌కార్డు లబ్దిదారులు చికిత్స చేయించుకున్నారు. ఇహెచ్ఎస్ వల్ల పనిభారం మూడింతలవుతుందని ఆరోగ్య మిత్ర తెలిపారు. ఇహెచ్ఎస్ స్కీమ్ కోసం జిల్లాకు అదనంగా 50 మంది ఆరోగ్యమిత్రలను నియమిస్తే పని ఒత్తిడి తగ్గుతుందన్నారు.
చాలీ చాలనీ జీతంతో కుటుంబం గడవక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక రంగారెడ్డి జిల్లాలో ఒక ఆరోగ్యమిత్ర విషం తాగి మరణించాడు. దీన్ని బట్టి ఆరోగ్య మిత్రలు ఎంత తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్యకారణాల్లో ఆరోగ్యశ్రీ పథకం ఒకటి. ఈ పథకంలో ఇప్పటి వరకు 22 లక్షల శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ పథకం విజయవంతమవడంలో ఆరోగ్యమిత్రలే కీలకపాత్ర పోషించారు. వీరి సమస్యలను మాత్రం ప్రభుత్వం మరచిపోయింది.

Saturday, March 1, 2014
4 రోజులైనా సర్జరీకి అనుమతి లభించలేదు
-నిమ్స్‌లో 'హెల్త్ కార్డు' లబ్దిదారుడి ఆవేదన
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఉద్యోగులు హెల్త్‌కార్డుతో నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్తె మెరుగైన చికిత్స లభిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగుల కోసం ప్రత్యేక వార్డులుంటాయని అన్నది. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదు. గత నెల గుండె కవాటాల మార్పిడి కోసం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు వచ్చిన పెన్షనర్ని డబ్బులు కడితేనే అడ్మిట్ చేసుకుంటామన్నారు. దీంతో అతను వెళ్లిపోయాడు. ఈ రోజు నిమ్స్ చేరిన నాలుగు రోజులైనా తన బిడ్డకు ఆపరేషన్ కోసం అనుమతి ఇవ్వలేదని ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అతనిపేరు పుండ్లిక్. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం, రాయకల్లోని చల్లగిద్ద తాండ వాసి. పుండ్లిక్ కూతురు పేరు కర్ర రాజలక్ష్మి. వయసు 12 ఏళ్లు. 7వ తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం ఎడమ చేతి చిటికెన వేలికి గాయమైంది. అప్పుడు వైద్యున్ని సంప్రదించారు. చికిత్స చేశారు. కానీ 15 రోజులుగా మళ్లీ చిటికెన వేలు బాగా నొప్పిగా పెడుతోందని, నరాలు లాగేస్తున్నాయని ఏడుస్తూ తండ్రికి చెప్పింది రాజలక్ష్మి. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నానని బాధను వ్యక్తం చేసింది. పుండ్లిక్ నారాయణఖేడ్ మండలం, కల్హెర్లోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పుండ్లిక్కు రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కింద తాత్కాలిక హెల్త్ కార్డు (టిఎస్ ఇ0043641/04) జారీ చేసింది. కార్డు తీసుకెళ్తే నాణ్యమైన వైద్యం అందుతుందన్న ఆశతో పుండ్లిక్ తన బిడ్డను తీసుకుని ఫిబ్రవరి 26న నిమ్స్‌కు వచ్చారు. హెల్త్‌కార్డుతో అవుట్‌పేషెంట్ విభాగంలో డాక్టర్‌ను సంప్రదించారు. రాజలక్ష్మి చిటికెన వెలిని పరీక్షించిన డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆసుపత్రిలో చేరాలని సూచించారు. రాజలక్ష్మికి ప్లాస్టిక్ సర్జన్ విభాగంలోని పిల్లల వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి మార్చి 1 వరకు సర్జరీకి అనుమతి రాలేదని పుండ్లిక్ 'ప్రజాశక్తి'కి తెలిపారు. ప్రీఆథరైజ్ కోసం పంపించామని ఒక సారి, అప్రోవల్ (అనుమతి) పెండింగ్‌లో ఉందని మరోసారి ఎస్ఎంఎస్ వచ్చిందని చెప్పాడు. 'ఆసుపత్రిలో ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. అనుమతి వస్తే సర్జరీ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. ఎంతో ఆశతో వస్తే నిరాశే మిగిలింది. సమస్యను ఎవరితో చెప్పుకోవాలో తెలియక రోగులు రోగులతో మాట్లాడుకుంటున్నారు' అని పుండ్లిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం అంటే మొత్తం సర్జరీ కోసం ఐదు రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని అన్నాడు. మళ్లీ సోమవారమైనా అనుమతి వస్తుందోనని ఎదురు చూస్తున్నాని చెప్పాడు. చివరికి ఈ సర్జరీకి అనుమతి లేదని, ఇన్ని రోజులు నిమ్స్‌లో ఉన్నందుకు డబ్బులు చెల్లించాలని ఆసుపత్రి వాళ్లు చెబితే ఏం చేయాలని? ఆందోళన వ్యక్తం చేశాడు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము డిసెంబరు 5న ప్రారంభమైంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మార్చి 5 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు శాశ్వత హెల్త్ కార్డులతో వస్తే అప్పుడెలా వైద్యం అందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటికైనా ఎంప్లాయీస్ హెల్త్ స్కీము నిర్వహించే ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు త్వరగా అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Subscribe to:
Posts (Atom)