ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఎపివివిపి)లో 43 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 532 సివిల్ అసిస్టెంట్ (స్పెషాలిటీ) పోస్టులకు సంబంధించి డాక్టర్ల నియామకానికి బ్రేక్‌పడినట్లు సమాచారం. నియామకానికి సంబంధించి 1/2013 నంబరుతో 2013, నవంబర్ 25న నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తులను స్వీకరించని తర్వాత ప్రొవిజనల్ లిస్టును ఎపివివిపి వెబ్‌సైట్‌లో పెట్టారు. లిస్టుపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 13 వరకు తెలపవచ్చని పేర్కొన్నారు. 18న పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడంలో నియామకం గురించి మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించింది. ఈ నియామకాలు తాత్కాలికంగా నిలిపి వేసి, గవర్నర్ అనుమతి తీసుకుని కొనసాగించాలా? లేదా ఎన్నికలయ్యాక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియామకాలు చేపట్టాలా? అని వైద్య ఆరోగ్య శాఖ ఆలోచిస్తోంది

No comments:
Post a Comment